KTR | రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం

KTR | రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం

కాంగ్రెస్ కుట్రను బయటపెడుతాం : కేటీఆర్‌


KTR | కుత్బుల్లాపూర్, ఆంధ్రప్రభ : ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో కాంగ్రెస్ సర్కారు రూ.ఐదు లక్షల కోట్లు కుంభకోణానికి (scandal) పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ ఎస్ నాయకుల బృందంతో గురువారం కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రదేశాల్లో కార్మికులతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలను వారికి వివరించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో గత ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం 9300 ఎకరాల స్థలాలను రైతులు, ప్రజల దగ్గరి నుండి సేకరించి పరిశ్రమలకు కట్టబెట్టిందన్నారు. రేవంత్ సర్కార్ ప్రస్తుతం ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరిట 9300 ఎకరాలను స్వాధీనం చేసుకొని రియల్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నిందన్నారు.

కాలుష్య కారక కంపెనీలను తరలించడంలో బీఆర్ ఎస్ కు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అయితే ఉన్న పరిశ్రమలను గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్పు చేసి ఉత్పత్తులను ప్రోత్సహించి కంపెనీలను తరలించకుండా ఉంచితే అటు పరిశ్రమలకు ఇంకో వైపు కార్మికులకు లాభదాయకంగా ఉంటుందని కేటీఆర్ (KTR) అన్నారు. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం కుత్బుల్లాపూర్ ఏరియాలో గజం విలువ 90 వేలకు పైగానే పలుకుతోందని, కానీ ప్రభుత్వం కార్డు వాల్యూ ద్వారా విక్రయించేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. మార్కెట్ రేటు ప్రకారం 9300 ఎకరాల విలువ 5 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని రేవంత్ సర్కార్ (Revanth Sarkar) ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో సరి కొత్త దోపిడీకి తెరలేపిందని, దీనిని బీఆర్ఎస్ తప్పకుండా అడ్డుకుంటుందని పరిశ్రమలు తరలిపోకుండా, కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.