Collector | ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తోనే ఎయిడ్స్ నివార‌ణ

Collector | ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తోనే ఎయిడ్స్ నివార‌ణ

క‌లెక్ట‌ర్ బాదావ‌త్‌

Collector | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి , ఆంధ్ర‌ప్ర‌భ : ముంద‌స్తు జాగ్ర‌త్త‌తోనే ఎయిడ్స్ నివారించుకోవ‌చ్చున‌ని, ఎయిడ్స్ నివార‌ణ ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ (Santhosh) అన్నారు. ఈ రోజు సమీకృత కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎయిడ్స్‌ నియంత్రణలో సమాజం ప్రతి ఒక్క‌రీతో పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆసుపత్రులు, రక్త బ్యాంకుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా రక్త నమూనాలను సమగ్రతతో పరీక్షించాలనే సూచనలు ఇచ్చారు.

హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే వ్యక్తులు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. హెచ్‌ఐవీ ఉన్నంత మాత్రాన వెంటనే ఎయిడ్స్‌ వస్తుందని భావించకూడదని, మూడు దశల తరువాత మాత్రమే అది ఎయిడ్స్‌ (AIDS) దశకు మారుతుందని వివరించారు. సరైన సమయంలో మందులు, పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిపై నియంత్రణ సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్ రమాదేవి, నాగర్ కర్నూల్ జ‌న‌ర‌ల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, వైద్యులు మెడికల్ కళాశాల విద్యార్థులు విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.