సుబ్బరాయుడి సన్నిధిలో జడ్జీ దంపతులు

కొత్తూరు, నంద్యాల జిల్లా , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి తన సతీసమేతంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ఈవో ఎం.రామక్రిష్ణ, ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపంలో విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి దంపతులకు స్వామి కంకణ ధారణ, పూలమాలలు, శాలువలు, శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అడ్వకేట్ రాజగోపాల్ రెడ్డి, పాణ్యం ఏఎస్ఐ రఫీ, మిలిటరీ సుబ్బారెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.