Simhachalam | నేడు చందనోత్సవం.. స్వామి నిజరూప దర్శనం
Simhachalam | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కలియుగ వెంకటేశ్వర స్వామి తర్వాత అంతటి మహిమాన్వితం కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం విశాఖ సింహాచలం. అక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారు నేడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి వార్షిక చందనోత్సవానికి సింహగిరి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.

ఇందుకోసం వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల పొడవును తగ్గించారు. అలాగే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.వివిఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని కుదించి, ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించారు. కొండపైకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించి, కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలకు అనుమతిస్తున్నారు.
