Election | రెండు పార్టీల ఫోకస్ అదే.

Election | రెండు పార్టీల ఫోకస్ అదే.
Election | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ (TRS) కాంగ్రెస్ పార్టీలు చేరికల పై ఫోకస్ పెట్టారు. కిందిస్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా మండలాల్లో ఆయా గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చేరికల పర్వం ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా బలమైన నాయకులను చేర్చుకొని పంచాయతీ ఎన్నికలలో గెలుపొందడానికి రెండు పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుండి కూచిపూడి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కుచ్ కుల రాజేష్ రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారు.

వీరు ప్రతిష్టాత్మకంగా ఒకరిపై ఒకరు వ్యూహాలు పన్నుతూ సర్పంచ్ ఎన్నికల్లో (Election) గెలుపొందడానికి పావులు కదుపుతున్నారు. పార్టీ గుర్తు పై ఎన్నికలు కానప్పటికీ.. స్వతంత్ర ఎన్నికలైనా పార్టీల ప్రభావం దాదాపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్టీల చేరికలు విస్తృతం అవుతున్నాయి. ఇటీవల తాడూరు మండలం చెర్లిటిక్యాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీదేవి బాల్రాజ్ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన కొందరు టీఆర్ఎస్ గ్రామ స్థాయి నాయకులు సురేందర్రావు తదితరులు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ పార్టీ ఇలా ఉండగా టీఆర్ఎస్ పార్టీ కూడా చేరికల పర్వాన్ని పెంచింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరుగుతున్నాయి.
