Wildlife | అడవుల్లో పెద్దపులి ఉంది.. అప్రమత్తంగా ఉండండి..

Wildlife | అడవుల్లో పెద్దపులి ఉంది.. అప్రమత్తంగా ఉండండి..

Wildlife | జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ రిజర్వ్ లోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్(FDO Rammohan) అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లికి చెందిన కూచడి శ్రావణ్ రావు ఆవును ఈనెల 26న పెద్దపులి దాడి చేసి చంపినందున బాధిత రైతుకు తక్షణమే స్పందించి రూ.25వేలు(Rs. 25 thousand) ప్రొసిడింగును ఈ రోజు ఆరేంజ్ కార్యాలయంలో రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ(Range Officer Lakshminarayana) అందజేశారు.

ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ.. పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అడవుల్లో వన్యప్రాణుల వేట కోసం కరెంటు వైర్లు, ఉచ్చులు, ఉరులు పెట్టకూడదని ఆయన తెలిపారు. వన్యప్రాణుల(Wildlife) వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.

పెద్దపులి ఎవరికైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇట్ కాస్ ప్రతినిధి వెంకటి, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు రవికుమార్, హన్మంతరావు, శ్రీనివాస్, తన్వీర్ పాష, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply