TG | ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొని, ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ముగ్గురిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం… ఓ వ్యక్తి బైక్‌పై రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు అదుపు తప్పి పక్కనే నిలబడి ఉన్న మరో ముగ్గురిపైకి దూసుకెళ్లింది.

ప్రమాద తీవ్రతతో నలుగురు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపడగా, ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply