Bus| నూజివీడు బస్సు బోల్తా

నూజివీడు బస్సు బోల్తా
- డ్రైవరు సహా 30 మంది గాయాలు
- ప్రకాశం జిల్లాలో ప్రమాదం
Bus| నూజివీడు, ఆంధ్రప్రభ : నూజివీడు నుండి శుక్రవారం ఉదయం శ్రీశైలం కు బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లాలో బోల్తా పడింది. గింగిరాలు తిరుగుతూ ఆ బస్సు పడిపోవటంతో… అందులోని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ బస్సు శ్రీశైలం వెళుతుండగా ప్రకాశం జిల్లా పెద్ద రావీడు మండలంలో బస్సు బోల్తా పడింది ఇందులో ఉన్న బస్సు డ్రైవర్ తో సహా 30 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమాచారంతో నూజివీడు డిపో అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి బయలుదేరి వెళ్లారు

