ETELA | విజయోస్తూ.. గెలిచి రండి
ETELA | విజయోస్తూ.. గెలిచి రండి
గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు తెప్పిస్తా
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ETELA | కమలాపూర్, ఆంధ్రప్రభ : గెలిచి రండి.. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు (funds) తెప్పిస్తానని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సందర్భంగా ఆయన ఈరోజు హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలోని తన నివాసానికి వచ్చిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ ఎన్నికల ఆశావహులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేస్తున్నామని, తమరి మద్దతు, ఆశీర్వాదం కావాలంటూ విజ్ఞప్తి చేశారు.
అ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. ఎన్నికల్లో (Election) పోటీ చేసి.. గెలిచి రండి.. అభివృద్ధి విషయం నేను చూసుకుంటా అంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇదే పర్యటనలో ఆయన ఒకే గ్రామంలో పోటీ పడుతున్నపలువురిని కూర్చోబెట్టి సముదాయించారు. పోటీలో ఎవరైనా ఒకరే ఉండాలని నచ్చచెప్పారు. కమలాపూర్ మేజర్ పంచాయతీలో ఇద్దరు బీజేపీ నాయకులు పోటీ పడగా, వారిలో గంధసిరి రవికుమార్ ను సముదాయించి పబ్బు సతీష్ ను పోటీ చేయాల్సిందిగా నిర్ణయించి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
