అక్రమ పార్కింగ్‌లపై స్పందించిన ట్రాఫిక అధికారులు

పటాన్‌చెరు, (ఆంధ్రప్రభ): పటాన్‌చెరు పట్టణం లోని 65వ జాతీయ రహదారిలో వాహనదారులు ఎదుర్కొంటు-న్న సమస్య ఆంధ్రప్రభ చొరవతో కొంత వరకు పరిష్కారమయింది. ప్రధాన రహదారిలో నత్త నడకన నడుస్తున్న రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం దీనికి తోడుగా సర్వీస్ రోడ్ల పక్కనే పాత వాహనాలను పెట్ట డంతో వాహనదారులు, పాదాచారు లు పడుతున్న అవస్థలపై ఈనెల 25న రహదారిపై ప్రయాణం నరకం అనే శీర్షిక ఆంధ్రప్రభ ప్రచూరించడంతో సంబంధిత అధికారులు కదిలారు. మంగళవారం పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కిరువైపులు ఉన్న పాత వాహనాలను తరలించి రోడ్డును క్లియర్ చేశారు. దీంతో ఆంధ్రప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు.
