జుక్కల్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం..

  • నూతన డిసిసి అధ్యక్షుడికి అభినందనలు

డోంగ్లి, ఆంధ్రప్రభ : లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న వెంటనే, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు హైదరాబాదులోని ఆయన నివాసంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇటీవల కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఏలే మల్లికార్జున్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గ డోంగ్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, మండల సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.

కామారెడ్డి డిసిసి అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ నియామకం, జిల్లాలో కాంగ్రెసు బలోపేతానికి కొత్త ఊపునిచ్చే పరిణామంగా పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ శక్తివర్ధక చర్యలకు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు–ఏలే మల్లికార్జున్‌ల సమన్వయం మరింత బలం చేకూరుస్తుందనే నమ్మకాన్ని డోంగ్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజానంద్ దేశాయి వ్యక్తం చేశారు.

Leave a Reply