సీఎం ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్..

- అభివృద్ది పనుల నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు…
- తిరువూరు కట్లేరు బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూ.30 కోట్లు…
- మున్నేరు వాగుకి రింగ్ బండ్స్ కోసం రూ.71.45 లక్షలు..
- కంచెల ఎత్తిపోతల పథకం అభివృద్ది కోసం రూ.15 కోట్లు…
- ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధన పై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు…
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులకు సంబంధించి నిధుల మంజూరు కోసం ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు సీఎం చంద్రబాబును, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ కూడా కలవటం జరిగింది.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ జగ్గయ్యపేట నియోజకవర్గం లోని మున్నేరు పాత ఆనకట్ట వద్ద తాత్కలికంగా రింగ్ బండ్లు ఏర్పాటు కు కరూ.71.45 నిధుల మంజూరు, నందిగామ నియోజకవర్గంలో కంచెల ఎత్తిపోత్త పథకం అభివృద్ది పనులకు రూ.15 కోట్లు నిధుల మంజూరు , తిరువూరు నియోజకవర్గం వినగడప వద్ద వున్న కట్లేరు బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ను కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , సానుకూలంగా స్పందించారు.
