Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…

Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా ఫేజ్-1, 2, & 3 ద్వారా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తును అందించే బల్క్ ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా 26న (బుధవారం) న‌గ‌రంలోని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.

ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు. నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లకు టీఎస్ ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేయ‌నున్నారు దాంతో.. కృష్ణా ఫేజ్-1, 2, & 3 పరిధిలోని డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది..

ప్రభావిత ప్రాంతాలివే !

  • చార్మినార్
  • వినయ్‌నగర్
  • బొజగుట్ట
  • రెడ్‌హిల్స్
  • నారాయణగూడ
  • ఎస్‌ఆర్‌నగర్
  • మారేడ్‌పల్లి
  • రియాసత్‌నగర్
  • కూకట్‌పల్లి
  • సాహెబ్‌నగర్
  • హయత్‌నగర్
  • సైనిక్‌పురి
  • ఉప్పల్
  • హఫీజ్‌పేట్
  • రాజేంద్రనగర్
  • మణికొండ
  • బోడుప్పల్
  • మీర్‌పేట్

జలమండలి అధికారులు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఈ అంతరాయం ఉన్న సమయంలో నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply