Telangana | షెడ్యూల్ విడుదల
Telangana | షెడ్యూల్ విడుదల
Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 9 లక్షల 70 వేల 75 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇంటర్ ఫస్టియర్‌లో 3,23,807 మంది, సెకండియర్‌లో 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే మార్కులు తక్కువగా వచ్చినవారి నుంచి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులు రేపటి నుంచే ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు.
