Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…

Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా ఫేజ్-1, 2, & 3 ద్వారా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తును అందించే బల్క్ ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా 26న (బుధవారం) నగరంలోని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.
ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు. నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లకు టీఎస్ ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు దాంతో.. కృష్ణా ఫేజ్-1, 2, & 3 పరిధిలోని డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది..
ప్రభావిత ప్రాంతాలివే !
- చార్మినార్
- వినయ్‌నగర్
- బొజగుట్ట
- రెడ్‌హిల్స్
- నారాయణగూడ
- ఎస్‌ఆర్‌నగర్
- మారేడ్‌పల్లి
- రియాసత్‌నగర్
- కూకట్‌పల్లి
- సాహెబ్‌నగర్
- హయత్‌నగర్
- సైనిక్‌పురి
- ఉప్పల్
- హఫీజ్‌పేట్
- రాజేంద్రనగర్
- మణికొండ
- బోడుప్పల్
- మీర్‌పేట్
జలమండలి అధికారులు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఈ అంతరాయం ఉన్న సమయంలో నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
