Chairmen | బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి

Chairmen | బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి
Chairmen | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం కోనా సమందర్ సొసైటీ చైర్మన్ గా సామ బాపురెడ్డి (Sama Bapureddy) మళ్ళీ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం జిల్లా డిసిసిబి అధికారులు బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలో 12 మంది చైర్మన్లను. పాలకవర్గాన్ని తొలగించారు. ఈ తొలగింపు పై 12 మంది చైర్మన్ లు. డైరెక్టర్లు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సహకార అధికారి ఉత్తర్వుల మేరకు బాపు రెడ్డి తో సహా పదవి కోల్పోయిన 12 మంది డైరెక్టర్లు తమ పదవి బాధ్యతలను మళ్లీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న,ప్రత్యేక అధికారి బాబురావు,సొసైటీ సీఈఓ కార్తీక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
