Adluri Laxman | నిరుపేదలకు సొంతింటి కల సాకారం…
Adluri Laxman | నిరుపేదలకు సొంతింటి కల సాకారం…
Adluri Laxman | మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Adluri Laxman | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం రోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ప్రభుత్వం సంకల్పించిన “ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం” లక్ష్యంగా ఇందిరమ్మ పథకం వేగంగా అమలవుతోందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను మంజూరు చేయడంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి బిల్లులను పొందాలని సూచించారు.
అలాగే, గ్రామాల్లో ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించని పక్షంలో, ఇతర అర్హులైన వారిని ఎంపిక చేసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. ఆవుల సాయవ్వ కుటుంబం గృహప్రవేశం చేసుకోవడం ఆనందదాయకమని పేర్కొంటూ, వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.
అనంతరం కలెక్టర్ తో కలిసి ఆవుల సాయవ్వ నూతన గృహంలో భోజనం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో మాజిద్ ,ఎంపిడివో రవీందర్ రావు, మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
