Gosha Mahal | ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాలకు రేవంత్ నేడు భూమి పూజ

హైదరాబాద్ : అవసరాలకు అనుగుణంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆసుపత్రికి భవనానికి ఇవాళ భూమిపూజ జరగనుంది.

గోషామహల్‌లో ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. భూమిపూజకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతంది.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండువేల బెడ్స్ సామర్థ్యంతో దీని నిర్మాణం ఉంటుంది.

ఇన్‌పేషంట్‌తో పాటు అవుట్‌ పేషంట్‌ సేవలతో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లను నిర్మిస్తారు.భారత్‌లోనే అతిపెద్ద మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, ప్రతి విభాగానికి ఆపరేషన్‌ థియేటర్లు ఉంటాయి. అన్నిరకాల డయాగ్నొస్టిక్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

వివరాలు

కేటాయించిన భూమి: 26.30 ఎకరాలు

మొత్తం బ్లాకులు: 8

ప్రతిపాదిత నిర్మాణ విస్తీర్ణం: 32 లక్షల చదరపు అడుగులుప

డకల సామర్థ్యం: 2000

మొత్తం విభాగాలు: 30

ఓపీ సేవలు: గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ఆడిటోరియం: 750 సీట్ల సామర్థ్యం

అవయవ మార్పిడి కేంద్రాలు: కిడ్నీలు, లివర్, చర్మం

Leave a Reply