Election | సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Election | సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు


ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల హడావుడి.


Election | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అధికారులు 23 గ్రామపంచాయతీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఊట్కూర్ మండలంలోని అమీన్ పూర్ ఎస్సీ జనరల్, అవసలోనిపల్లి జనరల్ మహిళా, బిజ్వార్ ఎస్సీ జనరల్, చిన్నపోర్ల బీసీ మహిళ, ఎడవెల్లి బీసీ జనరల్, కొల్లూర్ ఎస్సీ మహిళా, కొత్తపల్లి, జనరల్, లక్ష్మీ పల్లి జనరల్ మహిళ (Lakshmi Palli is a general woman) మొగ్దూంపూర్ బీసీ జనరల్, మల్లేపల్లి జనరల్, నాగిరెడ్డిపల్లి జనరల్, నిడుగుర్తి బీసీ జనరల్, ఓబులాపూర్ జనరల్, పగిడిమర్రి బీసీ జనరల్, పెద్దజట్రం, జనరల్, పెద్దపోర్ల, జనరల్ మహిళ, పులిమామిడి ఎస్సీ మహిళా, తిప్రాస్ పల్లి బీసీ మహిళ, సమిస్తాపూర్ జనరల్, తిమ్మారెడ్డిపల్లి తండా ఎస్టీ జనరల్, ఊట్కూర్, జనరల్ మహిళ, వల్లంపల్లి బీసీ మహిళ, ఎర్గాట్ పల్లి, జనరల్ మహిళా, తిమ్మారెడ్డి పల్లి తండా ఎస్ టీ జనరల్, చొప్పున అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 220 వార్డు స్థానాలు ఉండగా అధికారులు మహిళా వార్డు స్థానాలకు (For women’s ward seats) డిప్ ద్వారా రిజర్వేషన్లు ఖరారుచేశారు. మండలంలో44,992 మంది ఓటర్లు ఉండగా 22,929, పురుషులు 22,063 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్లు కావడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు.