Telangana | శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం

Telangana |శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం

Telangana | చెన్నూర్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు గోదావరి తీరంలో శ్మ‌శాన వాటిక‌ (Cemetery) పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా శ్మ‌శానవాటిక నిర్మాణ పనులు జాప్యం కాగా.. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృషితో శ్మ‌శాన వాటిక పనులకు శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, నాయకులు చెన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply