Congress | మహిళాభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
Congress | మహిళాభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
Congress |డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Congress | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుటుంబ అభ్యున్నతికి మహిళలే కీలకమని భవిష్యత్తు తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని అన్నారు.
Congress | ఆడబిడ్డలకు సారె పెట్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు సారె పెట్టి మహిళలను గౌరవిస్తున్నారని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా సాధికారితే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో అంజలి, మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సమ్మెట రాము గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ బొబ్బ సంజీవరెడ్డి, డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దసృ నాయక్, మైనార్టీ నాయకులు రఫీ, సీతారాం నాయక్, దూరు యాకన్న,ఎర్ర రవి తదితరులు పాల్గొన్నారు.
