ROTARY CLUB | దివ్యాంగులకు కొత్త వెలుగు

  • కృత్రిమ కాళ్ళ సేవా యజ్ఞంలో మహబూబాబాద్ రోటరీక్లబ్
  • 50మందికి ఉచితంగా కృత్రిమ కాళ్ళు అమర్చే కార్యక్రమం
  • ఈనెల 30న మెగా క్యాంప్.. నిపుణులచే ప్రత్యేక కొలతలు

ROTARY CLUB | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : దివ్యాంగుల సంక్షేమం కోసం మహబూబాబాద్ రోటరీక్లబ్ బాధ్యులు నడుంబిగించారు. దురదృష్టవశాత్తు ప్రమాదాలలో కాళ్ళు పోగొట్టుకున్న బాధితులకు అండగా నిలిచారు. ఇందుకోసం దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు అమర్చే బృహత్తరమైన కార్యక్రమాన్ని భుజానెత్తుకున్నారు. రోటరీ క్లబ్ ద్వారా కనీసం ఓ 50మంది బాధితులకైనా కృత్రిమ కాళ్ళను అమర్చాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో భాగంగానే మహబూబాబాద్ రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు మాలె నాగేశ్వరరావు, వద్దుల సురేందర్ రెడ్డి, తోర్నాల నగేష్ కుమార్, సీనియర్ రోటరియన్లు బిక్కి వెంకటేశ్వర్లు, బోనగిరి గిరిధర్ గుప్త, వల్లాల రమేష్, కుడారి నాగేందర్ రావు, ముల్లంగి మోహన్ రెడ్డి, బొల్లం శ్రీనివాస్, కళ్ళెం వెంకట్ రెడ్డి, సాదు మహిపాల్ రెడ్డితో పాటు క్లబ్ అధ్యక్షుడు వేమిశెట్టి కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి జంగాల విజయ్ కుమార్, కోశాధికారి శంతన్ రామరాజు జిల్లా కేంద్రంలోని వికాస్ కళాశాలలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాళ్ళు కోల్పోయిన 70 సంవత్సరాలలోపు గల బాధితులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించారు.

క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వికాస్ కళాశాలలో నిర్వహించనున్న మెగా క్యాంపులో పాల్గొని నియమించిన నిపుణులకు కొలతలు ఇవ్వాలని కోరారు. ఈ మెగా క్యాంపు ముగిసిన 10రోజుల అనంతరం మళ్ళీ మరో క్యాంపు నిర్వహించి బాధితులకు కృత్రిమ కాళ్ళను అమర్చడం జరుగుతుందని వివరించారు. 99484 27018/85550 33566/94400 42052 నెంబర్లలో ఏ ఒక్కదానికో బాధితుని ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, ఒక ఫోటో వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. క్యాంపుకు ఉదయం 9గంటల వరుకు రావాలని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన తర్వాత కనీసం ఆరు నెలలు గడిస్తేనే కృత్రిమ కాలు కొలతలు ఇచ్చేందుకు రావాలని వారు అన్నారు.

Leave a Reply