GHMC | అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్..

GHMC | అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్..
GHMC, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అన్నపూర్ణ స్టూడియో (Annpurna Studio), రామానాయుడు స్టూడియోలకు (Ramanaidu Studio) జీహెచ్ఎంసీ (GHMC) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించింది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది.
దీంతో పూర్తి స్తాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాలి. అయితే.. కేవలం 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లుగా తేలింది. అలాగే రామానాయుడు స్టూడియో 2.73 లక్షలకు బదులు 7,600 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా గుర్తించారు. అందుకనే అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
