Hyderabad | చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

Hyderabad | చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
Hyderabad | మోత్కూర్, ఆంధ్రప్రభ : గీతవృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22 న హైదరాబాద్(Hyderabad on 22nd) లోని బషీర్ బాగ్ లో నిర్వహించే గీత కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని గీతపనివారల సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు చాపల అంజయ్య అన్నారు.
ఈ రోజు మోత్కూర్(Motkur) మున్సిపల్ కేంద్రంలో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాపల అంజయ్యతో పాటు మోత్కూర్ గీత సొసైటీ అధ్యక్షులు బీసు సత్తయ్య, జిల్లా నాయకులు అన్నెపు వెంకట్(Annepu Venkat), పులకరం మల్లేష్, గీతా పనివారల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శీను, ఎడ్ల నరేష్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బోయిన వెంకన్న, బీసు సత్యనారాయణ, గీత సంగం నాయకులు మడిపల్లి రంగయ్య, చాపల మల్లయ్య ,మల్లె బోయిన బుచ్చయ్య, ఆరే సోమయ్య, గొడిశాల రాజయ్య, బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
