Firing | NZB | జాతీయ రహదారిపై కాల్పులు..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి 63పై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఇంద్రల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రోజున ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే…. నిజామాబాద్ జిల్లా ఇంద్రల్వాయి మండలంలోని దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి లారీ నిలిపాడు. మరో లారీలో ఇద్దరు వచ్చి అక్కడ ఆపారు. అనంతరం సదరు వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగులు చంద్రాయన్ పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
