100 dial | జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ తనిఖీలు

100 dial | జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ తనిఖీలు

100 dial | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని జీఆర్పి సీఐ పీ. సురేందర్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో బాంబు పేలుళ్లు ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం రైల్వే ప్రయాణికులను, బ్యాగులను తనిఖీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్లాట్ఫారం(platform) పైన కానీ ట్రైన్లలో కానీ అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల(police stations)కు, 100కు డయల్(dial 100) చేసి సమాచారం అందించాలని కోరారు. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యంగా మహిళలు కిటికీ పక్కన కూర్చో రాదని, బంగారు ఆభరణాలు(gold ornaments) ధరించకుండా ప్రయాణం చేయడం సురక్షితమని ఆయన అన్నారు.

ట్రైన్లలో ప్రయాణికుల కదలికలను పరిశీలించాలని, ఎవరైనా ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకొని వెళ్లడం చట్టారీత్యా నేరము అని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జీఆర్ పీసీఐ సురేందర్ తెలిపారు. ఈ త‌నిఖీల‌లో జీఆర్‌పీఆర్ ఎఫ్‌ ఎస్ ఐ(GRPRF SI)లు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Leave a Reply