సింధు హాస్పిటల్ ను ప్రారంభించి మోదీ
సింధు హాస్పిటల్ ను ప్రారంభించి మోదీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, గచ్చిబౌలిలో సింధు హాస్పిటల్ ను ప్రారంభించారు. క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నగరం గర్వించదగ్గ మరో అతిపెద్ద వైద్య సంస్థగా నిలవనుంది. 2.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, 18 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. దాదాపు 1,500 పడకలతో సామాన్యులకు కూడా అత్యాధునిక వైద్యం కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా మరో 33 రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు సేవలు అందించనున్నారు.
