15 to 25 years | మాదకద్రవ్యాల వినియోగంపై క‌ఠిన చ‌ర్య‌లు..

15 to 25 years | మాదకద్రవ్యాల వినియోగంపై క‌ఠిన చ‌ర్య‌లు..

15 to 25 years | నిజామాబాద్, ఆంధ్ర ప్రభ : మత్తు పదార్థాల వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని.. మీ భవిష్యత్తును, మీ కుటుంబాన్ని, సమాజాన్ని బాధ్యతతో కాపాడాలని, గంజాయి ఇతర మత్తు పదార్థాలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి(SI G. Anil Reddy) పేర్కొన్నారు.

ఈ రోజు కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ జడ్.పి.హెచ్.ఎస్(Uplur J.P.H.S)లో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్ల నుండి 25 ఏళ్ల (15 years to 25 years) వయసులో ఉన్న వారు ఎక్కువగా మాదకద్రవ్యాల బారిన పడే అవకాశముందని, పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లల పై తల్లితండ్రులు(parents) దృష్టి పెట్టాల్సిన‌ అవసరం ఉంటుందని అన్నారు.

మత్తు పదార్ధాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదకద్రవ్యాల రవాణ(drug traffic), వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్ ను విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమస్యను రూపుమాపడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా(Sales, transportation), వినియోగం లాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply