kavitha | మూసీ ప్రక్షాళన పెద్ద మోసం

kavitha | మూసీ ప్రక్షాళన పెద్ద మోసం
పూర్తి డీపీఆర్‌ను విడుదల చేయని ప్రభుత్వం
జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డీపీఆర్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు.
