Hyderabad | నగరంలో ఐటీ సోదాలు…
Hyderabad | నగరంలో ఐటీ సోదాలు…
పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లలో ఐటీ తనిఖీలు…
ఏకకాలంలో 15చోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు…
Hyderabad | ఆంధ్రప్రభ, గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో: నగరంలో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 15చోట్ల ఐటీ అధికారులు సోదాలు (15 locations IT searches) చేస్తున్నారు. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, ఇతర నగరాల్లోనూ ఈ రెండు హోటళ్లు నడుస్తున్నాయి. దుబాయ్‌లోనూ పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లు బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నాయి.
నగరంలో ఐటీ సోదాలు…
శాలిబండ (Shalibanda) లోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ (Rajendranagar) గోల్డెన్ హైట్స్ కాలనీలో నివాసం ఉంటున్న పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు (IT officers) ఈ సోదాలు చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఈ 3 గ్రూపులకు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు.
ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు (Multiple units), శాఖలు, అకౌంటింగ్ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లు వంటి చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టారు. మెహిఫిల్ రెస్టారెంట్‌కి నగరంలో 15 బ్రాంచీలు ఉండగా అదనంగా యూఏఈలో కూడా శాఖలు ఉన్నాయి. పిస్తా హౌస్‌కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో అనేక చోట్ల షాగౌజ్కు స్టోర్లు ఉన్నాయి.
