Hyderabad | నగరంలో ఐటీ సోదాలు…

Hyderabad | నగరంలో ఐటీ సోదాలు…

పిస్తా హౌస్​, షా గౌస్, మెహిఫిల్‌​ హోటళ్లలో ఐటీ తనిఖీలు…
ఏకకాలంలో 15చోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు…


Hyderabad | ఆంధ్రప్రభ, గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో: నగరంలో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 15చోట్ల ఐటీ అధికారులు సోదాలు (15 locations IT searches) చేస్తున్నారు. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న పిస్తా హౌస్​, షా గౌస్​, మెహిఫిల్‌ హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్​, ఇతర నగరాల్లోనూ ఈ రెండు హోటళ్లు నడుస్తున్నాయి. దుబాయ్​లోనూ పిస్తా హౌస్​, షా గౌస్​, మెహిఫిల్‌ హోటళ్లు బ్రాంచ్​లు నిర్వహిస్తున్నాయి.

శాలిబండ (Shalibanda) లోని పిస్తా హౌస్​ ప్రధాన బ్రాంచ్​లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్​ (Rajendranagar) గోల్డెన్​ హైట్స్​ కాలనీలో నివాసం ఉంటున్న పిస్తా హౌస్​ యజమాని మాజిద్​ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు (IT officers) ఈ సోదాలు చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఈ 3 గ్రూపులకు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు.

ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు (Multiple units), శాఖలు, అకౌంటింగ్​ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లు వంటి చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టారు. మెహిఫిల్‌​ రెస్టారెంట్​కి నగరంలో 15 బ్రాంచీలు ఉండగా అదనంగా యూఏఈలో కూడా శాఖలు ఉన్నాయి. పిస్తా హౌస్​కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్​లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్​ సిటీ తదితర ప్రాంతాల్లో అనేక చోట్ల షాగౌజ్​కు స్టోర్​లు ఉన్నాయి.