MLA | పాడె మోసిన ఎమ్మెల్యే మదన్
MLA | పాడె మోసిన ఎమ్మెల్యే మదన్
- ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ నేత
Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ మండల యువజన పార్టీ ఉపాధ్యక్షుడు సతీష్(Satish) పాడెను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ మోసి తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దేవయీ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల యువజన పార్టీ ఉపాధ్యక్షుడు సతీష్ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్(Madan Mohan) అక్కడకు చేరుకుని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సతీష్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో సతీష్ పాడెను ఎమ్మెల్యే మోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
