MLA | సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం…

MLA | సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం…
Kamareddy | డోంగ్లి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామానికి చెందిన సోనోబాకు సీఎం సహాయనిధి(CM Relief Fund) నుంచి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు(MLA Thota Lakshmi Kantarao) సహకారం రూ.60 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి ఈ రోజు డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారుడికి అందజేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని పేర్కొన్నారు. వీరితోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సీనియర్ నాయకులు పురుషోత్తం పటేల్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
