BRIDGE | ఓవర్ బ్రిడ్జిపై నుంచి ప‌డి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

BRIDGE | ఆదోని, ఆంధ్రప్రభ : ఆదోని పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జిపై నుంచి కింద‌ప‌డి శాంతమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. అకస్మాత్తుగా కళ్లు తిరిగి బ్రిడ్జి మీద నుంచి కిందికి జారి పడినట్లు ఆమె కుమారుడు తెలిపాడు. స్థానికులు వెంటనే స్పందించి, వృద్ధురాలిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఆదోనిలో ఓవర్ బ్రిడ్జ్‌పై పాదచారుల భద్రత, వృద్ధులకు సౌకర్యాలు, హ్యాండ్రైల్స్ పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply