Collector | ఆకస్మిక తనిఖీ…
Collector | ఆకస్మిక తనిఖీ…
Collector | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం గోవిందాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Dr. Satya Sharada) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో, రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని తొందరగా తూకం వేసి రైస్ మిల్లులకు పంపాలన్నారు. రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్స్ కవర్స్(Tarpaulins Covers) కప్పే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ట్యాబ్(Tab)లో రైతుల వివరాలు నమోదు చేసి వారి అకౌంట్లో తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో(purchase centers) రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
క్రమపద్ధతిలో తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని రైతులు నియమాల ప్రకారం తేమ శాతం వచ్చేలా చూడాలని సూచించారు. ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ల(paddy cleaners)లో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఎఓ అనురాధ, డీఎం సివిల్ సప్లైస్ సంధ్యారాణి, డీఎస్ ఓ కిష్టయ్య, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

