ఎస్ఎఇఎల్ చైర్మన్ మంత్రి లోకేష్ భేటీ

డాటా సెంటర్లపై పెట్టుబడుల ఆహ్వానం

( విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో)
ఎస్ఎఇఎల్ చైర్మన్ సుఖ్ భీర్ ఆవ్లాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా (minister lokes) మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. చంద్రబాబు CM Chandra Babu) నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే రాయలసీమలో Rayala seema) రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన డాటా సెంటర్ హబ్ గా (Data Centre Hub) మారుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుఖ్ భీర్ ఆవ్లా Sukh Bheer Awla) మాట్లాడుతూ… రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎస్ఎఇఎల్ (SAEL) సంస్థ 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెన్యువబుల్ ఎనర్జీ (reneble energy) ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాల ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించింది. ఎస్ఎఇల్ హైవేలు, ఇండస్ట్రియల్ పార్కులు, సస్టయినబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టిందని అన్నారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై ప్రతిపాదనలపై సుఖ్ భీర్ ఆవ్లా సానుకూలంగా స్పందించారు.
