1-minute-late : ఒక్క నిముషం లేటు… Andhra Prabha Sad News
1-minute-late : ఒక్క నిముషం లేటు… Andhra Prabha Sad News
- తల్లడిల్లిన తండ్రి ,బిడ్డ
- బోరున విలపించిన వైనం
(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )
1-minute-late : జాతీయ నీట్ పరీక్ష.. పేపర్ లీకేజీతో మళ్లీ విద్యార్థుల భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారిన వేళ,, దొడ్డిదారిలో సాల్వర్ ముఘా కలకలం. సృష్టిస్తే.. ఇంకో వైపున దేశవ్యాప్తంగా… ఒక నిముషం గడువు.. ఎందరో విద్యార్థులను. తల్లిదండ్రులను కంటతడి పెట్టించింది. ఓక వైపు బయోమెట్రిక్ సమస్య, మరో వైపు అడ్మిట్ కార్డులోని పొరపాటు వెరసి మధ్య ప్రదేశ్లో ముగ్గురు విద్యార్థులకు శాపంగా మారంటంతో.. Re – NEET పరీక్ష రాయలేకపోయారు. ఒక పరీక్ష కేంద్రంలో తన కూతురిని అనుమతించాలని బతిమాలి, బామాలినా అధికారులు కరుణించలేదు. కాళ్లు పట్టుకున్నా అవకాశం ఇవ్వలేదు. ఈ స్థితిలో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ అడ్డుకోవటంతో.. ఆ తండ్రి కిందపడి బోరున విలపించాడు. తన తండ్రి వ్యథకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కూతురూ తల్లడిల్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ – విదిశాలో చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో ఈ సన్ని వేశం అందరినీ కంటతడి పెట్టించింది.
