Telangana | ఘనంగా బాలల దినోత్సవం

Telangana | ఘనంగా బాలల దినోత్సవం
ఆలయ వద్ద వృద్ధులకు, ఆసుపత్రిలో రోగులకు భోజనం, పండ్లు పంపిణీ
Telangana | మక్తల్, ఆంధ్రప్రభ : బాలల దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా (Narayanpet district) మక్తల్ పట్టణంలోని గుర్లపల్లి రోడ్డులో ఉన్న బ్రైట్ స్టార్ గ్రామర్ స్కూలు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అదేవిధంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వృద్దులకు అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ స్టాప్ నర్స్ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) మాతృమూర్తి రాములమ్మ సిస్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లలకు బహుమతులు ఇవ్వడం సాధారణంగా జరుగుతుందన్నారు. కానీ పట్టణంలోని బ్రైట్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం పాఠశాల విద్యార్థులు కలిసి ఆసుపత్రిలో రోగులకు, ఆలయం వద్ద వృద్ధులకు అన్నం ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో (service activities) ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బిలాల్ ఉర్ రహిమాన్, కాంగ్రెస్ నాయకులు కోళ్ళ వెంకటేష్, రహీం పటేల్, సలాంబిన్ ఉమర్ బస్రవి, బి.శంషొద్దీన్, శ్రీనివాస్, రవూఫ్, ఆసుపత్రి డాక్టర్ లు సిబ్బంది పాల్గొన్నారు.

