y.s. jagan | కల్తీ అంటేనే జగన్.. మంత్రి సవిత

y.s. jagan | కల్తీ అంటేనే జగన్.. మంత్రి సవిత

y.s. jagan పుట్టపర్తి, ఆంధ్రప్రభ : తన 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు కల్తీ మద్యం అందజేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితమ్మ (Savithamma) పేర్కొన్నారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi ) నియోజకవర్గంలోని పెడపల్లిలో 3 లక్షల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా పెడపల్లి గ్రామంలో లక్ష్మీ నాయక్ లక్ష్మమ్మల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడారని, ఈయన ప్రజల గురించి ఆలోచించేదని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని పదేపదే చెప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిందేమీ లేదని కేవలం కొబ్బరి కాయలు కొట్టి కాలేజీలు తీసుకొచ్చామంటే ఎలా సాధ్యపడుతుందన్నారు.

తమ నాయకుడు రాష్ట్రంలో 17 నూతన కాలేజీలు తీసుకువచ్చి అందులో 10 కాలేజీలు పీపీపీ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగిందన్నారు. మిగతా 7 కాలేజీలు (7 colleges) కూడా త్వరలోనే ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కాలేజీల విషయంలో కోటి సంతకాల సేకరణ అంటూ జగన్ నాటకం ఆడుతున్నారని మెడికల్ కాలేజీలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు బెదిరించడం జగన్ కే చెల్లిందని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి ఇంటికి ఒకరిని పారిశ్రామికవేత్తలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2014 నుండి 2019 తెలుగుదేశం (Telugu Desam) ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలకు జగన్ ప్రభుత్వంలో బిల్లులు మంజూరు చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారన్నారు. అలా ఇబ్బందులు ఎదుర్కొన్న లబ్ధిదారులకు తమ ప్రభుత్వం బీసీ,ఎస్సీలకు 50 వేల రూపాయలు ఎస్టీలకు 75 వేల రూపాయలు అదనంగా చెల్లించి గృహాలను పూర్తి చేసేందుకు సహకరిస్తుందన్నారు. దీన్నిబట్టి చూస్తే ఎవరేంటో తెలుస్తుందన్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహానీయుడు చంద్రబాబునాయుడు అని ఆయన హయాంలో ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు.

Leave a Reply