బ్రోకరే..బొక్కేస్తున్నారు
రైతుకు నష్టమే గిట్టుబాటు
కొనుకేంద్రాల ఊసే లేదు
( నంద్యాల, ఆంధ్ర ప్రభ ప్రతినిధి )
అన్నదాత ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పుస్తెలు సైతం తాకట్టు పెట్టుకుని పంట పండిస్తే దళారులు (brokers) డేగళ్లా అన్నదాత నోటి కాడి కూడును దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతులకు మద్దతు ధర (minimum price) ప్రకటనకే తప్ప ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం తో రైతులు ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను గత్యంతరం లేక దళారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నారు. సినిమా టికెట్లు ధరలు (cinima tickets raise) పెంచి సినీ నిర్మాతలు, హీరోల ఆదాయం పెంచే ప్రభుత్వం రైతున్నకు మద్దతు ధర ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోంది, రెక్కలు ముక్కలు చేసుకుని, పంటను కన్నబిడ్డలా పెంచుకుంటూ పంట చేతికి వచ్చే సరికి నష్టానికి అమ్మకుంటున్న అన్నదాతకు ప్రభుత్వం ఆలంభనగా కొనుగోలు (prcurment centres) కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతోంది అని అని అన్నదాత ఆవేదన చెందుతున్న క్రమం.. ప్రభుత్వ సహాయ నిరాకరణ తీరుతో నంద్యాల జిల్లా వ్యాపితంగా రూ. కోట్ల పంట నష్టం చవిచూస్తున్న దైన్యంపై ఆంధ్ర ప్రభ అందిస్తున్న కథనం.
గత 20 రోజుల నుంచి ధాన్యం (paddy), మొక్కజొన్న (maize) పంట చేతికి వస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి రైతాంగానికి మద్దతు ధర అందని ద్రాక్షాలా మారింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో ఇదే అదనుగా దళారులు తమ ఇష్టారాజ్యంగా మొక్కజొన్న, ధాన్యం ధరలను నిర్ణయిస్తూ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్ర భుత్వ మద్దతు ధరకు, దళారులు కొనుగోలు చేసే ధరలకు భారీ వ్యత్యాసం ఉంది, దీంతో రైతాంగం మొక్కజొన్న, ధాన్యం పంటలను విక్రయించుకోలేక కళ్లాలలోనే ( in felds) ఉం చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేస్తుందా అని వెయ్యి కళ్లతో పొలంలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.
వర్షాలు సమృద్ధి…
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సమృద్దిగా కురవటంతో రైతులు నంద్యాల జిల్లాలో కె.సి కెనాల్, తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, చెరువులు, కుందూ నది కింద 2.80 లక్షల ఎకరాల్లో వరి పంట (paddy) సాగుచేశారు అంతే కాక వరి పంట తర్వాత స్థానంలో మొక్కజొన్న (maize) పంట కూడా జూన్, జులై నెలల్లో సాగు చేశారు. వరి పంటకు ఎకరాకు రూ. 40 వేలు, మొక్క జొన్న పంటకు ఎకరాకు రూ. 25 వేలు పెట్టబడులు పెట్టి పంటలు సాగు చేశారు. ఈ ఏడాదివర్షాలు విపరీతంగా (well mansoon) కురవటంతో పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే బండి ఆత్మకూరు మండలంలో సాగు చేసిన వరి పంట నూర్పిడి దశకు వచ్చింది. దీంతో రైతాంగం వరి కోత యంత్రాల ద్వారా పంటను నూర్పిడి ( harvest) చేసి కళ్లాల్లోకి తరలిస్తున్నారు. ఈ విధంగా గత 20 రోజుల నుంచి కళ్లాల్లోకి ధాన్యం చేరుతోంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో..!
ప్రస్తుతం మార్కెట్లో వరి ధాన్యానికి మద్దతు ధర ( లేకపోవటంతో రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఆశగా ఎదురు (farmers waiting for MSP) చూస్తున్నారు. రైతాంగం ఎక్కువగా నంద్యాల సోన, కర్నూలు సోన, షుగర్ లెస్, కెఎన్ఎం రకం ధాన్యాన్ని సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే సన్నరకాలైన కర్నూలు సోన, కెఎన్ఎం రకాలు 78 కెజీల బస్తా రూ. 1550 మించి పలకటం లేదు, ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం ఒక క్వింటా రూ. 2,389, కామన్ రకాలు ఒక క్వింటా రూ. 2,369 నిర్ణయించారు. ఈ లెక్కన ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ధాన్యాన్ని దళారులు (brokers buying cheaply) ప్రభుత్వ మద్దతు ధరకంటే దాదాపు రూ. 400 తక్కువగా ( farmer loss 400 for bag) కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తే రైతులు రూ. 16,000 నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఉన్నాధికారులు స్పందించి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
మొక్కజొన్న క్వింటాకు రూ.. 600 నష్టం
మార్కెట్లొ మొక్కజొన్న పంటకు కూడా ప్రభుత్వ మద్దతు ధర కరువైంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని రైతాంగం మొక్కజొన్న ( maize) పంటను సాగు చేస్తే పంట చేతికి వచ్చిన తర్వాత పంటను ఇటు తక్కువ ధరకు విక్రయించుకోలేక అటు కళ్లంతో ఉంచుకోలేక రైతులు కడుపు కోత అనుభవిస్తున్నారు. ఎకరాకు మొక్క జొన్న పంట 30 క్వింటాళ్లు దిగుబడులు వస్తున్నాయి. దళారులు, వ్యాపారులు ఒక క్వింటా మొక్కజొన్న పంట కేవలం రూ. 1800 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఒక క్వింటా రూ. 2,400 ఉండాలి, ఈ క్రమంలో ఒక క్వింటాకు రైతులు రూ. 600 నష్టపోతే 30 క్వింటాళ్ల పంటకు ఒక ఎకరాకే రూ. 18,000 వేలు ( maixe farmers loss for bag) నష్టపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 5లక్షల టన్నులు దిగుడులు వస్తాయని అంచనా వేశారు. దీంతో 50 లక్షల క్వింటాళ్ల (quintals) దిగుబడులు వస్తాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. దీంతో రైతాంగం కోట్లాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది.
త్వరలో కొనుగోలు కేంద్రాలు:
మార్క్‌ఫెడ్ డిఎం హరినాధ రెడ్డి
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. తాము ఇప్పటికే రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని మార్క్‌ఫెడ్ డిఎం హరినాధ రెడ్డి ( Markfed DM ) తెలిపారు. ఇప్పటికే రైతులు కళ్లాలలో మొక్క జొన్న పంట తీసుకవచ్చి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని హరినాధ రెడ్డి (Harinath Reddy) తెలిపారు. అంతే గాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పౌరసరఫాల శాఖ డిఎం అశ్వర్ధ నారాయణ తెలిపారు.
