Baby Seller : 19 పసిగుడ్లు అమ్మేసింది Andhra Prabha SPL Story
Baby Seller : 19 పసిగుడ్లు అమ్మేసింది Andhra Prabha SPL Story
ఆడబిడ్డ ₹ 3 లక్షలు
మగబిడ్డ ₹ 5 లక్షలు
పీడియాట్రిక్ పెడ్లర్స్ దందా
ఉత్తరాది బిడ్డలు.. బెజవాడలో విక్రయం
ఇది అంతరాష్ట్ర మాఫియా
బలగం సరోజినీ దందా19 శిశువులను అమ్మేసింది
(ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి) భారత ఉత్తర, దక్షిణ రాష్ట్రాల అతిపెద్ద రైల్వే జంక్షన్ గా పేరొందిన బెజవాడ.. తాజాగా హుమన్ ట్రాఫికింగ్ (Human Traffiking MaFia) మాఫియాకు మహా వ్యాపార కూడలిగా మారిపోయింది. ఇటు ఫెర్టిలిటీ సెంటర్ల మాయాజాలం.. అటు శిశువుల స్మగ్లర్లకు (Infant Smagglers) కోట్లు కురిపించే అంగళ్ల సెంటర్ ( Sale Centers) గా బెజవాడ అవతరించింది.
Baby Seller శిశువులను తస్కరించి..

ఇటీవల సృష్టి మాయాజాలంలో శిశువుల విక్రయాలు బహిర్గతం కాగా.. అంతక ముందే.. ఇండియన్ పీడియాట్రిక్ పెడ్లర్ మాఫియా మిస్టరీ కథ రెండేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో యావత్ భారత దేశమూ ఔరా.. అంటూ అవాక్కైంది. తాజాగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో శిశువులను తస్కరించి.. బెజవాడలో బేబీ సేల్ (Baby Sale Centers) సెంటర్ కు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 5గురు పసికందులను రక్షించారు.
ఈ నేరగాథలోనూ సూత్రధారి పాత నేరజాణే ప్రత్యక్షమైంది. ఈ నేరనాయకి సైన్యంలో 9 మంది భటులనూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ పసిగుడ్ల వ్యాపారి .. గత రెండేళ్లుగా ఈ అక్రమ వ్యాపారంలో ఆరితేరింది. ఇంతకీ ఈ సరోజినీ ఎవరు? ఈమె నేర ప్రస్థానం ఏమిటో.. గమనిద్దాం.
Baby Seller ఇలా నెమ్మదిగా నోట్ల పంటలో బిజీబిజీగా

బగలం సరోజినీ అలియాస్ బలగం సరోజినీ (Sarojini) .. శిశువుల అక్రమ వ్యాసారి (Baby Seller) గా అవతరించే ముందు ఆమె.. కేవలం ఓ ఆసుపత్రిలో గదులను శుభ్రం చేసే (Washer) కార్మికురాలు. విజయవాడలో ఫెర్టిలిటీ ఆసుపత్రిలో పని చేస్తుండగా… అక్రమ వ్యాపారంలో చొరబడింది. గర్భం దాల్చటానికి అవసరమైన అండాల సేకరణ (Collecting Fertility Eggs) పని చేపట్టింది.
సింగ్ నగర్, పాయకాపురం, సితార సెంటర్.. పాతబస్తీల్లో పేద యువతుల (Poor Youg Ladies) నుంచి అండాలను సేకరించి ఫెర్టిలిటీ (Frtility Centres) సెంటర్లకు సప్లయి చేసేది. ఇలా నెమ్మదిగా నోట్ల పంటలో బిజీబిజీగా మారిపోయింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లోనూ కొన్నాళ్లు పని చేసింది. ఇక్కడే శిశువుల అమ్మకం దందాకు బీజం పడింది. పుణె, అహ్మదబాద్, ముంబై ప్రాంతాలకు చెందిన పీడియాట్రిక్ పెడ్లర్స్ తో పరిచయం ఏర్పడింది. ఈ ముఠా వివిధ నగరాల్లో పేద దంపతుల వేటలో నిమగ్నమయ్యాయి. తమ బిడ్డల్ని అమ్మే అమ్మానాన్నలను వెతికి వెతికి పట్టుకుని.. సంపన్న దంపతులకు విక్రయించే స్థాయికి చేరారు.
Baby Seller

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మేడిపల్లి, రాచకొండల్లో శిశువుల అక్రమ రవాణా కేసులో సరోజినీ అడ్డంగా దొరికిపోయింది. 2024 మే 22న హైదరాబాద్ సీఐడీ అధికారులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాను ఛేదించారు. మే 22 న ముగ్గురిని అరెస్టు చేశారు. మే 22న ఓ వైద్యురాలు శోభారాణి, – స్వప్న, షేక్ సలీంను అరెస్టు చేశారు. ఈ ముగ్గుర్ని పోలీసులు దంచటంతో మే 27న మరో 8 మంది దొరికారు.
వీరిలో – బండారి హరి హర చేతన్, బండారి పద్మ, బలగం సరోజ, ముదవత్ శారద అలియాస్ షకీలా పఠాన్, ముదవత్ రాజు, పఠాన్ ముంతాజ్ అలియాస్ హసీనా, జగనాథం, అనురాధ, యాత మమత సహా 11 మందిని అరెస్టు చేశారు. 13 మంది శిశువులను రక్షించారు. ఇందులో 9 మంది ఆడశిశువులు, 4గురు మగ శిశువులు ఉన్నారు. ఈ కేసులో సరోజినీ కేవలం పాత్రధారి మాత్రమే. ఈ ముఠా అప్పటికే 50 మంది (50 Infants) శిశువులను అమ్మేసింది. ఏపీ, తెలంగాణలో పిల్లలు లేని దంపతులకు ఈ శిశువులను విక్రయించి లక్షలకు లక్షలు గడించారు. ఇక కేసుల్లో సరోజినీ అరెస్టు కాగా. ఆగస్టు 2024లో బెయిల్‌పై బయటకు వచ్చింది.
Baby Seller : బెజవాడలో తొలి దందా

జైలు నుంచి వచ్చిన 6 నెలల కాలంలోనే నేరుగా తానే సూత్రధారి పాత్ర పోషింది. పేద యువతులను చేరదీసింది. ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్ (Preeti Kiran) , అహ్మదాబాద్‌కు చెందిన అనిల్ (Anil) అనే వ్యక్తులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది ఫెర్టిలిటీ సెంటర్లు (Fertilty Centre) , డయాగ్నోస్టిక్ (Daignostic) సెంటర్ల వద్ద తిరుగుతూ సంతానం లేని దంపతులను గుర్తించి పిల్లల విక్రయ బేరాలు కుదిర్చేది. తన నెట్ వర్క్ నుంచి శిశువులను విజయవాడకు రప్పించి.. శిశువుల సంరక్షణ బాధ్యతలను యువతులకు అప్పగించేంది. ఆడపిల్ల రేటు ₹ 3 లక్షలు, మగపిల్లోడి రేటు ₹ 5 లక్షలు.
Baby Seller : పసిగుడ్లే లక్ష్యం
అప్పుడే కళ్లు తెరచిన పసిగుడ్లే సరోజినీ టార్గెట్. గతంలో పేద తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని సేకరించిన సరోజినీ.. ఇక ఆసుపత్రుల్లో శిశుల దొంగతనం (Child Abduction) పై దృష్టి కేంద్రీకరించింది. ఇక ముంబై, పుణె, ఢిల్లీ, ఆహ్మదబాద్ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో శిశువు చోరీలకు తెర లేపారు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో శిశువు అంగళ్లను (Baby Sale Centre) ప్రారంభించింది. ఇలా… ప్రతి ట్రిప్పులో పది నుంచి 15 మంది శిశువులను రప్పించిన సరోజినీ దందా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకనాటి అండం సరఫరా వ్యాపారి… ఈ రోజు పీడియాట్రిక్ పెడ్లర్ గా సరోజినీ అవతిరించింది.
Baby Seller : పోలీసు ఆపరేషన్ లో..
ఈ ముఠాకు బలగం సరోజినీ (Kingpin ) ప్రధాన సూత్రధారి కాగా.. షేక్ ఫరీనా (26) పిల్లలను తరలించడంలో సహకరించేది. షేక్ సైదాబీ (33): పిల్లల (baby sale) విక్రయాల్లో సాయపడేది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన పిల్లల సంరక్షణ (baby Care) బాధ్యతలను కొవ్వాపు కరుణశ్రీ (25) చూసేది. పిల్లల సంరక్షణ, విక్రయ ఏర్పాట్లలో పెదాల శిరీష (26) పాల్గొనేది. విజయవాడలో మార్చి 1, 2025న ఈ 5గురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొదట ముగ్గురు శిశువులను పోలీసులు రక్షించగా, తర్వాతి విచారణలో మొత్తం 6 గురు శిశువులను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జువైనల్ జస్టిస్ (JJ Act) యాక్ట్ , పీడీ యాక్ట్ (Pd Act) కింద చర్యలు చేపట్టారు.
Baby Seller
బెజవాడను వీడని సరోజినీ పిల్లలను విక్రయిస్తున్న పది మంది (10 Pediatric Prdlere) ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు గురువారం ( 2025 డిసెంబర్ 18న) అరెస్ట్ చేశారు. 5 గురు శిశువు (Infant) లను రక్షించారు. ₹ 3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరజాణ బగలం సరోజినీ అలియాస్ బలగం సరోజినీ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. గరికముక్కు విజయలక్ష్మి, వాడ పల్లి బ్లేస్సి, ముక్తిపేట నందినీ, షేక్ బాబా వలి, ఆమదాల మణి, షేక్ ఫరీనా, ఐరి వంశీ కిరణ్ కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు ను అరెస్ట్ చేశారు. డిల్లీ, ముంబాయి నుండి పిల్లలను అక్రమంగా తీసుకువచ్చి పిల్లలు లేని దంపతులకు సరోజినీ ముఠా విక్రయిస్తోంది. గతంలో సరోజినీపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా విజయవాడ భవానీపురం, నున్న, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆమె ఇప్పటివరకు సుమారు 19 మంది శిశువులను వివిధ రాష్ట్రాల్లో విక్రయించినట్లు గుర్తించారు.
