రేపే ఫైనల్ ఫైట్..
రేపే ఫైనల్ ఫైట్..
బీహార్ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి చివరి రోజైన ఆదివారం రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ, (Narendra Modi) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (amit shah) విపక్షాల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల జంగిల్ రాజ్ పాలనను గుర్తు చేస్తూ దేశంలోకి చోరబాటుదారులను ఏరిపారేస్తామని హామీ ఇచ్చారు. తొలిదశ పోలింగ్ లోనే ప్రజలు విపక్ష ఇండియా కూటమికి 65 ఓల్టుల షాక్ ఇచ్చారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ లో (Bihar) ఎన్టీఏ ప్రభుత్వ ప్రమాణా స్వీకారానికి తాను మళ్లీ వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరో వైపు ఎన్టీయే విజయం పై చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున కార్గే (Mallikarjun kharge) కొట్టిపారేశారు. వారి వాదనలో ఎలాంటి పస లేదని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఎన్నికల కమీషన్ సహకరిస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇక బీహార్ ప్రచారం ముగిసిన మరుసటి రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) బీజేపీ పాలి రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పర్యటించడం విమర్శలకు దారి తీసింది. బీహార్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయం పై స్పందిస్తూ రాహుల్ గాంధీ పిక్నిక్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కీలకమైన సమయంలో బీహార్ కు దూరంగా ఉండటమంటే.. విపక్షాలు ఓటమిని అంగీకరించినట్టే అని ఆయన విమర్శించారు.
