మేం అధికారంలోకి వస్తే..

మేం అధికారంలోకి వస్తే..

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఢిల్లీ, లండన్, అమెరికా ఇలా ఎక్కడికైనా పలాయనం చిత్తగించవచ్చు. కానీ.. ఓటు చోరీ చేసినందుకు వారిని పట్టుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉంటే.. ఓటర్ల జాబితాలో మార్పులు చేసి మా మద్దతుదార్ల పేర్లు తొలగించి ఓట్లు దొంగలించే వారిని ఆపితే బీహార్ లో ప్రభుత్వాన్ని ఇండియా కూటమి నూటికి నూరు శాతం ఏర్పాటు చేస్తుందని బీహార్ లో ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. కిషన్ గంజ్ లోని ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ… ఈ ఎన్నికల కేవలం పార్టీల మధ్య పోరు కాదు… దేశంలో రెండు మార్గాల మధ్య ఘర్షణ.

ఒక వైపు దేశాన్ని ఐక్యం చేసి ప్రజలకు సమానత్వం, ఉపాధి న్యాయం తీసుకువచ్చే మార్గంలో మా ఇండియా కూటమి ఉంది. మరో వైపు దేశాన్ని విభజించాలని దేశ జనాభాలో 10 శాతం మాత్రమే ఉన్న అగ్ర కులాలకు పట్టం కట్టాలని అంబానీ, అదానీలకు సంపదను కట్టబెట్టాలని దేశ ఆర్ధిక వ్యవస్థ సైన్యం, న్యాయ వ్యవస్థను ఆక్రమించాలని కోరుకునే మార్గంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. మేము ఐక్యత కోసం పారాడుతుంటే.. వారు విభిజన కోసం పారాడుతున్నారు. ఇండియా కూటమి దేశాన్ని ఐక్యం చేస్తుంది. బీజేపీ విభజనకు ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బీహార్ వాసికి ఉద్యోగం, మహిళలకు రుణాలు, రైతులకు కనీస మద్దతు ధర, కుల గణన, 50 శాతం రిజర్వేషన్ పరిమితి రద్దు, మహిళలు, రైతులు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తామని.. ఉపాధి, సమానత్వం, ప్రగతి తీసుకువస్తామని వాగ్థానం చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్స్ పై మేడిన్ చైనా అని కాకుండా మేడిన్ బీహార్ అని రాయాలని కోరుకుంటున్నాను బీహార్ ను ఏకం చేద్దాం.. మార్పుని తీసుకుని వద్దాం అని రాహుల్ గాంధీ అన్నారు.

Leave a Reply