విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతుల‌కు అవ‌గాహ‌న‌

నర్సింహులపేట, ఆంధ్రప్రభ :నర్సింహులపేట మండలంలోని పెద్దనాగరం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ పాండు నాయక్ మాట్లాడుతూ.. రైతులు కెపాసిటర్ లు ఉపయోగించుకోవాలని, విద్యుత్‌ను పొదుపు చేయడంతో పాటు హై వోల్టేజ్‌లో, వోల్టేజ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు.

రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే అదనపు ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఎత్తుగా ఉండే చెట్లను పెంచడం వల్ల గాలి తుఫాన్‌లు వచ్చినప్పుడు తోటి రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు పోతే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని, మీరు నేరుగా వేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, ఎటువంటి అంతరాయం కలిగినా మీరు మరమ్మతులు చేయకుండా మీ దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రైతులు విద్యుత్ ప్రమాదాల నివారణ కొరకు సహకరించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో లైన్ ఎన్స్పెక్టర్ మల్సూర్, లైన్‌మెన్ లింగయ్య, ఏఎల్ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply