SCR | ఇంటర్ లాకింగ్ పనులు – 30 రైళ్లు రద్దు

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లిం చారు. ఈ నెల 10 నుంచి 20 వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఖమ్మం సమీపంలో టెక్నికల్ పనుల నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాజీపేట-డోర్నకల్‌,డోర్నకల్‌-విజయవాడ మార్గంలో రైళ్లను రద్దు చేసారు. మొత్తం11 రోజుల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని.. మరి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో కీలక రూట్ లో 11 రోజుల పాటు పలు ప్రధాన రైళ్ల నిర్వహణలో మార్పు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడిం చారు.

గోల్కొండ,భాగ్యనగర్‌, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 9 రైళ్లను దారి మళ్లించగా… నాలుగు రైళ్లు గంట నుంచి గంట న్నార వరకు ఆలస్యంగా నడవనున్నాయి.

సికింద్రాబాద్‌-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ 11 నుంచి 21 వరకు రద్దు చేసారు.అదే విధంగా సికింద్రాబాద్‌ -సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ని ఈ నెల 10 నుంచి 21 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేసారు. గుంటూరు -సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ ని 10,11,15,18,19,20 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ 11,14, 16,18,19,20 తేదీల్లో రద్దు చేసారు. సికింద్రాబాద్‌- విశాఖ పట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని కూడా 19,20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది.దీంతో పాటుగా ఆదిలాబాద్‌ -తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 9,11,14, 18,19 తేదీల్లో గంటన్నర పాటు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా విజయవాడ -నూజీవీడు మధ్య పనుల కోసం ఆరు రైళ్లను రద్దు చేసారు. రాజమహేంద్ర వరం – విజయవాడ, కాకినాడ – విజయవాడ రైళ్లను ఈ నెల 8న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 7,8 తేదీల్లో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *