చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో వందేమాతరం వేడుక

చిట్యాల, ఆంధ్రప్రభ : వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లు చిట్యాల ఇంచార్జ్ ఎమ్మార్వో బి.విజయ ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి ఇన్చార్జి విద్యాధికారి సైదా నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యాలయ సిబ్బందితో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు తెలిపారు.
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవంబరు 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని తెలిపారని అన్నారు.
