notification | ఫస్టు ఫేజ్ ప్రచారం క్లోజ్.. ప్రలోబాలకు రెడీ!

notification | ఫస్టు ఫేజ్ ప్రచారం క్లోజ్.. ప్రలోబాలకు రెడీ!
- పల్లెల్లో నిశ్శబ్ద వాతావరణం
- వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి
notification | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం ముగిసింది. ఒక్కసారిగా పల్లెలో ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం (Quiet atmosphere) చోటు చేసుకుంది. ఇంటింటా ప్రచారాలు ఆగిపోవడంతో పల్లెల్లో సందడి తగ్గిపోయింది. వినూత్న ప్రచారాలు, వ్యక్తిగత హామీలు, పార్టీపరంగా హామీలు కురిపించే ప్రచారాలకు పుల్‌స్టాప్ పడింది. ఓటర్లను ఆకర్షించుకోవడానికి ప్రచారాలు హోరెత్తించారు. సర్పంచ్‌లు తమకు మద్దతు ఇచ్చే పార్టీ నాయకులను ప్రచారంలోకి దించారు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతి గ్రామంలో ప్రచారాలు సందడి కనిపించేది. ప్రస్తుతం ఆ ప్రచారాలకు తెరపడింది.
మొదటి విడతలో 3,836 పంచాయతీలకు ఎన్నికలు..
రాష్ట్రంలో తొలి దశలో 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్(notification)ను ఎన్నికల కమిషనర్ జారీ చేశారు. ఇందులో ఐదు పంచాయతీలకు వివిధ కారాణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవులకు 13,127 మంది, వార్డు సభ్యులకు 37,440 మంది పోటీలో ఉన్నారు. 149 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు(9,331 wards) ఏకగ్రీవమయ్యాయి. సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాని వాటిలో మంచిర్యాల జిల్లాలో మూడు, ఆసిఫా బాద్, నిర్మల్ జిల్లాలో ఒక్కో పంచాయతీ ఉన్నాయి. వార్డున సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాని వార్డులు అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41, మంచిర్యాలలో 34 ఉన్నాయి.
వ్యక్తిగత హామీలు..
రాష్ట్రంలో అనేక పంచాయతీల్లో ప్రచారాల్లో సర్పంచ్ అభ్యర్థులు వ్యక్తిగత హామీలు కూడా ఇచ్చారు. కొందరు బాండ్ పేపరు మీద హామీలు ఇస్తూ ఓటర్లకు చూపించారు. కొందరు అభ్యర్థులు అక్రమ ఆస్తులు సంపాదిస్తే జప్తు చేసుకోవచ్చునని బాండ్ పేపరు మీద రాసి గ్రామ పెద్దలకు అందజేశారు. ఆడ పిల్ల పుడితే రెండు వేలు ఒకరు, ఐదు వేలు ఒకరు డిపాజిట్(deposit) చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బంధువులు వచ్చే వరకూ మృత దేహాలు ఉంచడానికి ఫ్రీజు శవ పేటికలు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ మద్దతు దారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామానికి అధికంగా వచ్చేలా కూడా హామీలు ఇస్తున్నారు.
ప్రలోబాలకు రెడీ…
ప్రచారాలు ముగిసిన వెంటనే ఈ రోజు రాత్రి నుంచి ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తారని పల్లెల్లో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తారని, యువతకు విందుల పేరుతో మద్యం పోస్తారని గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు(candidates) సర్పంచ్ పదవి దక్కించుకోవడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారని సమాచారం. బలమైన అభ్యర్థులు ఉన్న చోట వివాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తూ నిఘా వేస్తున్నారు. కొందరు అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి..
వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్, వరంగల్ నగరంతోపాటు ముంబయి లాంటి ప్రదేశాలకు వెళ్లిన వారిని రప్పించడంలో అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారు ఎక్కడ ఉన్నారో అక్కడకు వెళ్లి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలింగ్(polling) రోజు తీసుకు రావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరి వాహన ఖర్చులతోపాటు రెండు మూడు రోజులు కూలి పోతుంది కాబట్టి వారి ఎంతో కొంత ముట్టజెప్పడానికి ప్రత్యేక వ్యక్తులను ఏర్పాటు చేశారు.
