ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
రహస్యంగా విచారిస్తున్న డీఎస్పీ
ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, నవంబర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ పలు కార్యాలయాలపై దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda) లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోదాలను నిర్వహిస్తున్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయానికి (Sub-Registrar Office) సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో అప్రమత్తమైన రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంగణం నుంచి ఉడయించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతిపై పలు ఆరోపణలు అవినీతి కార్యాలయానికి పుంకాలుగా వెళ్లాయి.
కార్యాలయం తలుపులు మూసివేశారు. రిజిస్టర్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దొంగ రిజిస్టర్లు చేశారని ఆరోపణలు అధికం కావడంతో డీఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టారు. కొంత నగదు సొమ్ము కూడా దొరికినట్లు సమాచారం. మరిన్ని పూర్తి వివరములు తెలియవలసి ఉంది. కార్యాలయంలో పలికి ఎవరిని రానీయకుండా గేటు వద్ద బందోబస్తు ఉంచారు.సోదాలు నిర్వహిస్తుండటంతో సాయంత్రం వివరాలు తెలుపుతామని డీఎస్పీ సోమన్న తెలిపారు.
