తహసిల్దార్‌కు వినతి

తహసిల్దార్‌కు వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం(42 percent for BCs) రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చౌటుప్పల్ మండల తహసిల్దార్ వీరాబాయి(Veerabai)కి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుకల శ్రీనివాస్ యాదవ్, రాసాల వినోద్ యాదవ్, అశోక్ యాదవ్(Ashok Yadav), ఎర్రోళ్ల క్రాంతి కుమార్, మండల నాయకులు రెడ్డపాక నరేష్, చెక్క సాయికుమార్, జోగు స్వామి, చరణ్, శ్రీకాంత్, లింగస్వామి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply