జోగి రమేష్ అరెస్టుపై బీసీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడి ధ్వజం

జోగి రమేష్ అరెస్టుపై బీసీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడి ధ్వజం
హిందూపురం, ఆంధ్రప్రభ : లిక్కర్ స్కాం(Liquor scam)లో జోగి రమేస్‌కు సంబంధం లేకున్నా అరెస్ట్ చేయడం దుర్మార్గం, కక్షపూరితం అని బీసీ సెల్ హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) అరెస్టుపై వీడియో రిలీజ్ చేశారు. తన భార్య బిడ్డలు సాక్షిగా, అమ్మవారు సాక్షిగా తనకు అక్రమ లిక్కర్ తో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ బలవంతంగా ఎక్సైజ్ పోలీసులు ఉదయం 5 గంటలకే ఆయనను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష పూరితమైందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమ మద్యం సరఫరా అవుతుంది అని అలాంటిది వదిలిపెట్టి నిర్ధాక్షణంగా వైసీపీ మీద ఉన్న కక్షతో ఈ విధంగా చంద్రబాబు చేస్తుండడం మంచి పద్ధతి కాదన్నారు. పలాస ఘటనను పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఇక మరో మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) కచ్చితంగా సీఎం అవుతారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్(Strong warning) ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వదిలి ఇలా అక్రమ అరెస్టులు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
